రాష్ట్రానికి ఏఐసీసీ కార్యదర్శుల రాక
విభజన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై వాకబు చేసేందుకు ఏఐసీసీ తన దూతలను పంపుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసు హైదరాబాద్ వచ్చారు. మరో కార్యదర్శి కుంతియా సాయంత్రం నగరానికి చేరుకోనున్నారు. వీరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చించనున్నారు.